మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకుని, దేశానికి ఎన్నో మరపురాని ఘనవిజయాలను అందించిన మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని "ధోని ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ ద్వారా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. కాసేపటి క్రితమే ధోని ఎంటర్టైన్మెంట్స్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ విడుదలైంది. అలానే ఈ సినిమాలో నటించబోయే క్యాస్ట్ ఎనౌన్స్మెంట్ కూడా జరిగింది.
ధోని ఫస్ట్ ప్రాజెక్ట్ కి 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేసారు. అలానే ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నదియా, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. రమేష్ తమిళమని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ధోని సతీమణి సాక్షి సింగ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.