నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా "దసరా". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా, దసరా మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుందనే ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై తాజాగా సాలిడ్ క్లారిటీ అందుతుంది. దసరా రెండు భాగాలుగా కాదు, కేవలం ఒక భాగంగానే విడుదలవుతుందని అఫీషియల్ సోర్సస్ ద్వారా అందుతున్న సమాచారం అని తెలుస్తుంది. ఈ మేరకు నాని కూడా కాసేపటి క్రితమే చేసిన ట్వీట్ ఈ విషయంపై పక్కా క్లారిటీ ఇస్తుంది. జస్ట్ వన్.. విత్ ది పవర్ ఆఫ్ 2 ఆర్ ప్రోబబ్లీ మోర్ ..! అని నాని ట్వీట్ చెయ్యడం జరిగింది.
పోతే, మార్చి 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో దసరా మూవీ విడుదల కావడానికి రెడీ అవుతుంది.