ఈ రోజు ఉదయం ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గారు గుండెపోటుతో మరణించారు. చెన్నైలో ఉంటున్న శ్రీనివాసమూర్తి తన స్వగృహంలోనే చివరి శ్వాస తీసుకున్నారు.
ఎంతో మంది ఇతర భాష నటులకు తెలుగులో తన గాత్రాన్ని అందించి, ఇక్కడ వారికి స్టార్ స్టేటస్ ని కల్పించారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి శ్రీనివాసమూర్తి గారి వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పటివరకు విడుదలైన సూర్య సినిమాలన్నిటికీ తెలుగు డబ్బింగ్ ఆయనే చెప్పారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
శ్రీనివాస మూర్తి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సూర్య ట్వీట్ చేసారు. ఇది వ్యక్తిగత నష్టం.. శ్రీనివాస మూర్తి గారి గాత్రం, ఎమోషన్స్ నా నటనకు తెలుగులో జీవాన్ని అందించాయి. త్వరగా మమ్మల్ని అందరినీ విడిచి వెళ్లిపోయారు. మిస్ యూ సర్.. !! అంటూ సూర్య ఎమోషనల్ గా రాసుకొచ్చారు.