మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన కొత్త చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి, అశేష ప్రేక్షకాభిమానుల నీరాజనాలు అందుకుంటున్న ఈ సినిమా తాజాగా 'వీరయ్య విజయ విహారం' పేరిట గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకోనుంది. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సుబేదారి, హన్మకొండలో వీరయ్య విజయ విహారం కార్యక్రమం జరగబోతుందని ఇదివరకే ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారని పేర్కొంటూ కాసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
ఈ సినిమా రీసెంట్గానే 100కోట్ల షేర్ ను రాబట్టింది. డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ రాజా రవితేజ క్రూషియల్ రోల్ లో నటించారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.