నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన న్యూ మూవీ "వీరసింహారెడ్డి" సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి కలెక్షన్ల ఊచకోత కోస్తుంది. జనవరి 12వ విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజు బాలయ్య కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను వసూలు చేసింది. నిన్నటితో రెండు వారాలను పూర్తి చేసుకుని తాజాగా ఈరోజు మూడవ వారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు రోజులలో ఈ సినిమా 126కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక, ఓవర్సీస్ లోనూ వీరసింహారెడ్డి 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు.
అఖండ, వీరసింహారెడ్డి ..తో బ్యాక్ టు బ్యాక్ 100కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రస్తుతం మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా వ్యవహరించారు. థమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.