బాలయ్య బాబాయ్ ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ 'ఎన్నో రాత్రులొస్తాయి' రీమిక్స్ వెర్షన్ ను అబ్బాయ్ కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా "అమిగోస్" లో ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు నిన్ననే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరగ్గా, తాజాగా కాసేపటి క్రితమే ఈ రొమాంటిక్ సింగిల్ యొక్క ప్రోమోను సాయంత్రం 05:09 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపారు.
రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో విభిన్న యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు.