'కలర్ ఫోటో' ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాతో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
వచ్చే నెల 3వ తేదీన థియేటర్లకు రాబోతున్న పద్మభూషణ్ కుటుంబం విభిన్న ప్రచార కార్యక్రమాలను చేపట్టి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ మేరకు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ఆంధ్రా తెలంగాణాలలోని కాలనీలను విజిట్ చేసి, తమ సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్స్ కి ఫ్యామిలీలను ఆహ్వానించే విభిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో, రేపు గుంటూరు, ఎల్లుండి భీమవరం, ఆ తరవాత కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో రైటర్ పద్మభూషణ్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ జరగనుంది.