నాలుగేళ్ళ విరామం తదుపరి "పఠాన్" తో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ని థియేటర్లలో ఘనస్వాగతం లభించింది. జనవరి 25 నాన్ హాలిడే రోజున హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదలైన పఠాన్ ఆడియన్స్ నుండి ఊరమాస్ రెస్పాన్స్ అందుకుంటుంది. తొలి రోజు 106కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన పఠాన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది.
తాజాగా రెండో రోజు (రిపబ్లిక్ డే) కూడా బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల తుఫాను మరింత బలపడినట్టు తెలుస్తుంది. రెండో రోజు 68కోట్లను కలెక్ట్ చేసి, ఒక్క రోజులో 70కోట్లకు దగ్గరగా వసూలు చేసిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది. మొత్తంగా రెండో రోజు 113.60 కోట్లను కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ 219.60 కోట్లతో పఠాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. ఇక, వీకెండ్ లో ఈ కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.