రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "శశివదనే". గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో, ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో, ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో రక్షిత్ కు జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుండగా, సంగీత దర్శకుడు రఘు కుంచె, శ్రీమాన్, దీపక్, ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
తాజాగా శశివదనే ఫస్ట్ లిరికల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. 'శశివదనే' అని సాగే ఈపాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించగా, హరిచరణ్, చిన్మయీ శ్రీపాద ఆలపించారు. పూర్తి పాట ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున విడుదల కాబోతుంది.