బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'కిసీ కా భాయ్ కిసీకి జాన్' సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది ఈద్ కానుకగా విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా తదుపరి 'టైగర్ 3' స్టార్ట్ చేస్తారు.
ఇటీవలే మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' లో స్పెషల్ క్యామియో చేసి, టాలీవుడ్ డిబట్ ఎంట్రీ చేసిన సల్లూభాయ్ అతి త్వరలోనే టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమాను చెయ్యబోతున్నారని టాక్ నడుస్తుంది. పుష్ప, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ లో సల్మాన్ సినిమా చెయ్యబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.