ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ - సాయిధరమ్ తేజ్ సినిమా లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 07:38 PM

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వినోదయ సిత్తం' అతి త్వరలోనే తెలుగులో రీమేక్ కాబోతుంది. ఈ మేరకు అఫీషియల్ అప్డేట్ ఐతే లేదు కానీ, జోరుగా ప్రచారం మాత్రం జరుగుతుంది. అదీకాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ కోసం మెగా అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణసారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మేనమామ - మేనల్లుడు ఇద్దరూ ఫస్ట్ షెడ్యూల్ లోనే కలిసి నటించబోతున్నారట కూడా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa