నాచురల్ స్టార్ నాని కెరీర్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న 30వ సినిమా ఈరోజే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ క్లాప్ నివ్వగా, అల్లు అరవింద్ , Ch. అశ్వినీదత్ , దిల్ రాజు, విజయేంద్ర ప్రసాద్, హను రాఘవపూడి, బుచ్చిబాబు తదితరులు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఫస్ట్ ప్రొడక్షన్ గా తెరకెక్కుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa