తాను నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి సంబంధించి ఏదో ఒకటి చెబుతూ నిత్యమూ వార్తల్లో ఉంటున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నేడు తన అభిమానుల ముందుకు ఓ ప్రశ్నను తీసుకు వచ్చారు. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరూ ఎవరో చెప్పుకోవాలని అడుగుతూ, చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి దీర్ఘాలోచనలో ఉండగా, వెనుకవైపు చంద్రబాబు పాత్రధారి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ పిక్ పై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో పంచుకున్న ఫోటోను మీరూ చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa