మహేష్ సూరపనేని దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హంట్' జనవరి 26, 2023న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో డిజిటల్ స్ట్రేంయిగ్ కి అందుబాటులో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులు ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో శ్రీకాంత్ మరియు భరత్ నివాస్, కబీర్ దుహన్ సింగ్, మైమ్ గోపి మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భవ్య క్రియేషన్స్‌కు చెందిన వి ఆనంద ప్రసాద్ సమర్పిస్తున్నారు. అరుల్ విన్సెంట్ కెమెరా క్రాంక్ చేయగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.