ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ ఖాన్ అమ్రోహి (73) కన్నుమూశారు. జావేద్ ఖాన్ గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే అయన తుది శ్వాస విడిచారు. 'జావేద్ అందాజ్' 'అప్నా అప్నా', 'లగాన్', 'ఇష్క్', 'హమ్ హై రాహీ ప్యార్ కే', 'చక్ దే ఇండియా' వంటి అనేక చిత్రాలలో నటించారు.జావేద్ ఖాన్ అమ్రోహి చివరిసారిగా 'సడక్ 2' సినిమాలో నటించారు.