శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "Mr. కింగ్". శశిధర్ చావలి డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో యశ్విక నిష్కళ హీరోయిన్ గా నటిస్తుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా కాసేపటి క్రితమే చిత్రబృందం సెకండ్ లిరికల్ ప్రోమోను విడుదల చేసింది. బ్రేకప్ ఈజ్ వేకప్ .. ఫ్రెండ్స్ బ్రేకప్ ని సెలెబ్రేట్ చేసుకోవాలి.. అనే థీమ్ తో ఈ పాట తెరకెక్కింది. ఫుల్ లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం నాలుగున్నరకు విడుదల కాబోతుంది.
హాన్విక క్రియేషన్స్ బ్యానర్ పై బొల్లిబోయిన నాగేశ్వరరావు (BN రావు) నిర్మిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.