రెండ్రోజుల క్రితం విడుదలైన "దసరా" సెకండ్ సింగిల్ 'ఓరి వారి' హార్ట్ బ్రేకింగ్ మెలోడియస్ సాంగ్ యొక్క తమిళ్ వెర్షన్ 'థీ కారి' లిరికల్ వీడియో కాసేపటి క్రితమే విడుదలయ్యింది. తమిళంలో కూడా సంతోష్ నారాయణే ఈ పాటను ఆలపించగా, వివేక్ లిరిక్స్ అందించారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చేరుకొని నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి కీరోల్ లో నటిస్తున్నారు.