మరో రెండ్రోజుల్లో 'ఆహా' ఓటిటిలో "గాలోడు" డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఆహా సంస్థ గాలోడు న్యూ ట్రైలర్ కట్ ను విడుదల చేసింది. మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17 నుండి గాలోడు మూవీ ఆహా మరియు, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటీలలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.
టెలివిజన్ హోస్ట్ గా, కమెడియన్ గా, మంచి ఎంటర్టైనర్ గా, హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఈ సినిమాలో హీరోగా నటించగా, సుధీర్ కు జోడిగా గెహన సిప్పి నటించింది. రాజశేఖర్ పులిచర్ల డైరెక్ట్ చేసి, నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు.