బిగ్ బాస్ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకులలో సూపర్ పాపులరైన కంటెస్టెంట్ సోహెల్ రియాన్. ఆయన లీడ్ హీరోగా నటించిన చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. ఇందులో మోక్ష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్ - AR అభి అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. హరిత గోగినేని నిర్మించారు.
జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలతో సక్సెస్ఫుల్ గా మారిన ఒక లక్ష్మణుడి కథగా, యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 30న ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదలై, డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ మేరకు ఈ నెల 17 నుండి ఆహా లో లక్కీ లక్ష్మణ్ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.