కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "సార్ / వాతి". మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా యొక్క తెలుగు ప్రీమియర్ షోలు ఎక్స్క్లూజివ్ గా రేపు రాత్రి ఏడు గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో జరగబోతున్నాయి. ఈ మేరకు మేకర్స్ నుండి అధికారిక ప్రకటన విడుదలయింది.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.