మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. కొన్ని వారాల క్రితమే ఈ పాన్-ఇండియన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా గాసిప్ ప్రకారం, ఈ బిగ్గీ తదుపరి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది అని మరియు ఈ షెడ్యూల్‌లో సిజ్లింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సెట్స్‌లో జాయిన్ కానుందని సమాచారం. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2023లో థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.