జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. బాలయ్యతోపాటు కుటుంబ సభ్యులు పాడెమోశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారాలోకేష్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. తండ్రి మోహనకృష్ణ కుమారుడికి శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.