మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇటీవల మలయాళం-తమిళ ద్విభాషా చిత్రం 'నన్‌పకల్ నేరతు మయక్కం' థియేటర్‌లలో ప్రేక్షకులని నిరాశపరిచింది. ఈ సినిమా మాత్రమే కాదు, ఈ లెజెండరీ నటుడి ఇటీవల విడుదలైన చాల సినిమాలు ఫ్లాప్‌లు గా నిలిచాయి. తాజాగా ఈ రోజు నటుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో తన తదుపరి చిత్రానికి 'కన్నూర్ స్క్వాడ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపానీ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకి రోనీ డేవిడ్ రాజ్ మరియు మహమ్మద్ షఫీ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రాస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంతో పాటు, ఏప్రిల్ 2023లో విడుదల కానున్న అఖిల్ అక్కినేని ఏజెంట్‌లో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa