ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్దూకి ల‌క్కీ ఛాన్స్ మిస్స‌యిపోయింది!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 07:54 PM

అటు తెలుగు, ఇటు త‌మిళం, మ‌రోవైపు హిందీ అంటూ ముడు వైపులా కాళ్లు పెట్టి ప్ర‌యాణం సాగించాల‌ని చూశాడు సిద్దార్థ్‌. తొలుత‌.. విజ‌యాలు ల‌భించాయి గానీ, ఆ త‌ర‌వాత ఏ ప‌రిశ్ర‌మ‌కీ న్యాయం చేయ‌లేక‌పోయాడు. ఇప్పుడు సినిమాలు లేక సిద్దూ కెరీర్ డ‌ల్ అయిపోయింది. దానికి తోడు వ‌చ్చిన అవ‌కాశాలు సైతం చేజారిపోతున్నాయి.
‘భార‌తీయుడు 2’లో సిద్దూకి ఛాన్సొచ్చింద‌ని, క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డిగా సిద్దార్థ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. శంక‌ర్ – సిద్దార్థ్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. శంక‌ర్ ‘బోయ్స్‌’ ద్వారానే సిద్దూ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టాడు. ఆ సినిమాతో గుర్తింపునీ ద‌క్కించుకున్నాడు. అందుకే శంక‌ర్ సిద్దూని క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఆదుకోవ‌డానికి ముందుకొచ్చాడ‌ని చెప్పుకున్నారు. సిద్దార్థ్ కూడా భారీ ప్రాజెక్టులో అవ‌కాశం సాధించినందుకు ఉబ్బిత‌బ్బిబ్బి అయిపోయాడు. కానీ.. ఈ ఛాన్స్ ఇప్పుడు సిద్దూ చేతుల్లోంచి చేజారిపోయిన‌ట్టు టాక్‌. ఆ అవ‌కాశం మ‌రో త‌మిళ న‌టుడు ఆర్య‌కి ద‌క్కిన‌ట్టు స‌మాచారం. `వ‌రుడు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కూ సుప‌రిచితుడ‌య్యాడు ఆర్య‌. `సైజ్ జీరో`లో అనుష్క ప‌క్క‌న న‌టించాడు. సిద్దూ ప్లేస్‌లో ఆర్య రావ‌డం దాదాపు ఖాయ‌మ‌ని త‌మిళ చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. సో… సిద్దూకి ఈ ఛాన్స్ కూడా పోయిన‌ట్టే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa