ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ ఓడిపోయాడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 03:22 PM

ఎంత పెద్ద స్టార్ అయినా వ‌రుస‌బెట్టి ఫ్లాపులిస్తుంటే ఇమేజ్ డ్యామేజ్ కావ‌డం ఖాయం. ఒక‌ప్పుడు బాలీవుడ్‌ను ఏలిన షారుఖ్ ఖాన్ ప‌రిస్థితి ఇప్పుడెలా త‌యారైందో తెలిసిందే. అత‌డి పేరు ముందు సూప‌ర్ స్టార్ ట్యాగ్ తీసేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తిందిపుడు. ఇక ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌కుటం లేని మ‌హారాజుగా వెలుగొందిన ర‌జ‌నీకాంత్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. నాన్-బాహుబ‌లి రికార్డ‌లున్న‌ట్లుగా.. ఇంత‌కుముందు నాన్-ర‌జనీ రికార్డుల గురించి మాట్లాడుకునేవాళ్లు. వేరే స్టార్ల బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల క‌లెక్ష‌న్లు.. ర‌జ‌నీ డిజాస్ట‌ర్ల వ‌సూళ్ల కంటే త‌క్కువ ఉండేవి.

కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో ర‌జ‌నీ స‌క్సెస్ రేట్ దారుణంగా ప‌డిపోవ‌డంతో క‌థ అడ్డం తిరిగింది. రోబో మిన‌హాయిస్తే సూప‌ర్ స్టార్‌కు హిట్టే లేదు గ‌త ప‌దేళ్ల‌లో. ప్ర‌తిసారీ ర‌జ‌నీ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుని నిరాశ చెంద‌డం మామూలైపోయింది. ర‌జ‌నీ సినిమా అంటే బ‌డ్జెట్లు ఎక్కువ‌. దానికి త‌గ్గ‌ట్లే బిజినెస్ జ‌రగ‌డం.. సినిమా అంచ‌నాలు అందుకోలేక బ‌య్య‌ర్లు మునిగిపోవ‌డం మామూలు విష‌యం అయిపోయింది.

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న 2.0 కూడా న‌ష్టాల‌నే మిగ‌ల్చ‌డంతో ఆ ప్ర‌భావం పేట మీద బాగానే పడింది. చాలా ఏళ్ల కింద‌టి ర‌జ‌నీ సినిమాల కంటే దీనికి బిజినెస్ త‌క్కువ జ‌రిగింది. తెలుగులో అయితే కేవ‌లం రూ.15 కోట్ల‌కే హ‌క్కులు అమ్ముడ‌య్యాయి. త‌మిళ‌నాట కూడా త‌క్కువ రేట్ల‌కే సినిమాను అమ్మారు. అయినా ఇది పెట్టుబ‌డిని వెన‌క్కి తేలేక‌పోయింది. రూ.100 కోట్ల షేర్ తెస్తే త‌ప్ప బ్రేక్ ఈవెన్‌కు రాలేని ప‌రిస్థితి ఉంటే.. ఈ చిత్రం ఫుల్ ర‌న్లో రూ.75 కోట్ల షేర్ మార్కు ద‌గ్గ‌ర ఆగిపోయేలా ఉందంటున్నారు ట్రేడ్ పండిట్లు. తెలుగులో ఈ చిత్రం రూ.6-7 కోట్ల మ‌ధ్య షేర్ రాబ‌ట్టిందంతే. నిర్మాత వ‌ల్ల‌భ‌నేని అశోక్ స‌గానికి స‌గం పెట్టుబ‌డి న‌ష్ట‌పోయాడు.

మొద‌ట్లో ఈ సినిమాకు చాలిన‌న్ని థియేట‌ర్లు ఇవ్వ‌లేదు. త‌ర్వాత థియేట‌ర్లు దొరికే ప‌రిస్థితి ఉన్నా.. క‌లెక్ష‌న్లు లేక‌పోవ‌డంతో ఉప‌యోగించుకోలేదు. త‌మిళంలో అజిత్ సినిమా విశ్వాసం ముందు పేట‌ నిల‌వ‌లేక‌పోయింది. ఆ సినిమా వ‌సూళ్ల‌లో ఇది 60 శాతం మాత్ర‌మే రాబ‌ట్టింది. కొన్ని నెల‌ల కింద‌ట విజ‌య్ సినిమా స‌ర్కార్ ర‌జ‌నీ రికార్డుల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొట్టింది. దాని త‌ర్వాత వ‌చ్చిన 2.0 ఆ రికార్డుల‌కు చాలా దూరంలో ఆగిపోయింది. ఐతే విజయ్ చేతిలో అప్పుడు ఇన్ డైరెక్ట్ ఓట‌మి ఎదుర్కొన్న ర‌జ‌నీ.. ఇప్పుడు అజిత్‌తో డైరెక్ట్ ఫైట్‌కు దిగి ఓడిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa