ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డెలివరీ బాయ్ : మంచి సందేశం తో తీసిన షార్ట్ ఫిల్మ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 02:58 PM
తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గురువారం విడుదలైన 'ది డెలివరీ బాయ్' మంచి సందేశం తో కూడిన లఘు చిత్రం గా దూసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ అబ్రమేని దర్శకత్వం వహించారు. ఈ లఘు చిత్రం లో పవన్ కుమార్ లీడ్ రోల్ చేయగా నాగార్జున మెంగని మరియు శ్రీకాంత్ నరెడ్ల ,భాను ,ఎల్లం తదితరులు సపోర్టింగ్ రోల్ చేసారు.

ఈ కథ విషయానికి వస్తే ఒక బీటెక్  పూర్తి చేసిన విద్యార్ధి ఒకనొక సందర్భంలో తన ఫ్యామిలీకి అండగా ఉండేందుకు డెలివరీ బాయ్ గా పని చేసినపుడు తాను పడ్డ కష్టాలు అవమానాలు గురించి చెబుతూ తర్వాత అతను ఏ విధంగా పైకి వచ్చాడో చూపిస్తూ నడుస్తుంది. అలాగే ఏ చిత్రం లో సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. ప్రశాంత్ అబ్రమేని ఈ లఘు  చిత్రాన్ని ఎంతో షార్ట్ అండ్ స్వీట్ గా తెరెకెక్కించారు. ఇందులో మెయిన్ లీడ్ చేసిన పవన్ ఆ పాత్రలో లీనమై నటించాడు.
ఈ లఘు చిత్రాన్ని చూడాలంటే కింది లింక్ లను ఫాలో అవండి. 
Telangana Folk Video Songs -Telugu DJ Songs
 Bachelor Boys





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa