ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజినీకాంత్ సినిమాకు అందుకే కలెక్షన్స్ రాలేవు

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 03, 2019, 06:04 PM

రజనీకాంత్ తాజా చిత్రంగా .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేట' తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. తెలుగులో ఈ సినిమా ఫుల్ రన్ పూర్తయింది .. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.97 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది. తెలుగులో రజనీకాంత్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనిలేదు. ఇక విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ కి కూడా ఇక్కడ మంచి ఇమేజ్ వుంది.

ఈ సినిమాలో సిమ్రాన్ .. త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందువలన ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లనే రాబడుతుందని భావించారు. కానీ తెలుగులో సంక్రాంతి బరిలో 'కథానాయకుడు' .. 'వినయ విధేయ రామ' .. 'ఎఫ్ 2' సినిమాలు నిలిచాయి. ఆదిలో థియేటర్స్ సమస్య .. ఆ తరువాత ఆడియన్స్ ఆసక్తి చూపకపోవడం వలన, ఈ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి ఆదరణ పొందలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa