బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, గ్లామర్ బ్యూటీ తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పింక్ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పింక్ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇప్పుడు అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రలలో ‘బద్లా’ అనే చిత్రం తెరకెక్కుతుంది. సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 8న విడుదల చేయనున్నారు. 2016లో వచ్చిన ‘కాంట్రాటీయెంపో’ అనే స్పానిష్ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షారుక్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిన్న చిత్ర ఫస్ట్ లుక్‌ని షారూఖ్ విడుదల చేయగా, ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు చాలా ఆసక్తకరంగా ఉన్నాయి. 40 ఏళ్ల కెరీర్‌లో ఒక్క కేసు కూడా ఓడిపోని లాయర్ బాదల్ గుప్తా పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.
#BadlaTrailer keeps you hooked till the last frame, gets it right... #Badla stars Amitabh Bachchan and Taapsee Pannu... Directed by Sujoy Ghosh... 8 March 2019 release... Link: https://t.co/ViQJokeQZT
— taran adarsh (@taran_adarsh) February 12, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa