అఫ్ఘానిస్థాన్‌లో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్న ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు, మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 2.9 తీవ్రతతో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa