AP: కోటి సంతకాల పేరుతో జగన్ డ్రామా చేయాలని చూశారని, కానీ అది కూడా విఫలమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కూటమి ఎంపీలతో సమావేశమై మాట్లాడారు. వైద్య కళాశాలల పీపీపీ వ్యవహారం మాత్రమే వైసీపీకి దొరికిందని, ఆ విషయంలో కూడా ప్రజలు వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. ఢిల్లీ స్థాయిలోనూ పీపీపీ విధానంపై ఎంపీలు అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa