విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ OTT ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా జూన్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం భారతదేశంలో ప్రైమ్ వీడియో యొక్క సినిమాల విభాగంలో రెండవ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో నరేష్ సిన్సియర్ గా నటించాడని నెటిజన్స్ ప్రశంసించారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. శత్రు, శరత్, ఇంద్రజ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.