హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. గతంలో క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడ్డానని వెల్లడించారు. ఒకసారి ఏఐజీ ఆసుపత్రిలో కొలనోస్కోపీ పరీక్ష చేయించుకున్నానని, అందులో క్యాన్సర్ కాని పాలిప్స్‌ను ముందుగా గుర్తించి తొలగించారని ఆయన వెల్లడించారు. దాన్ని గుర్తించకుండా ఉంటే క్యాన్సర్ గా మారేదేమో అని చిరంజీవి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యంపై అవగాహన ఉంటే క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునన్నారు.