యాక్షన్ హీరో అర్జున్ సర్జా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయా? ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్ త్వరలో పెళ్లిపీటలెక్కనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ టాప్ కమెడియన్‌తో ఐశ్వర్య వివాహం జరగనుందన్న ప్రచారం కోలీవుడ్ సర్కిళ్లలో బాగా వినిపిస్తోంది. సీనియర్ కమెడియన్ తంబిరామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య గత కొంతకాలంగా ప్రేమలో ఉందట. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించారట. త్వరలోనే ఈ ప్రేమ పక్షుల పెళ్లి అత్యంత వేడుకగా జరగనుందని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనేది వెలువడలేదు. అటు ఉమాపతి ఫ్యామిలీ నుంచి కానీ, అర్జున్ కుటుంబం నుంచి ఏదైనా ప్రకటన వస్తే ఈ పెళ్లి విషయంలో క్లారిటీ వస్తుంది.
కాగా యాక్షన్ కింగ్ అర్జున్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఐశ్వర్యా అర్జున్. 2013లో 'పట్టతు యానయ్' అనే తమిళ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత ప్రేమ బరహా అనే కన్నడ లో నటించింది. టాలీవుడ్‌లోనూ ఐశ్వర్య చేయాల్సింది. తండ్రి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా షూటింగ్ కూడా మొదలెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఆగిపోయింది. ఇక ఉమాపతి రామయ్య విషయానికొస్తే.. 2017లో 'అదగపాతుతు మగజనంగలే' తో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం దేవదాస్ అనే లో నటిస్తున్నాడు.
Umapathy Ramaiah (Thambi Ramaiah Son) & Aishwarya Arjun (Arjun’s Daughter) to tie the knot soon! pic.twitter.com/r0dRY3i6js
— Christopher Kanagaraj (@Chrissuccess) June 25, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa