టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం రంగబలి. జులై 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో భాగంగా హీరో నాగ శౌర్య మాట్లాడుతూ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరో నాగ శౌర్యకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. అదేమిటంటే ఇటీవల ఒక అబ్బాయి రోడ్డుపైన అమ్మాయిని ఏడిపిస్తుంటే.. మీరు వెళ్లి కొట్టారు కదా!
అంతలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనక మీ ఇంటెన్షన్ ఏంటి? అని అడగగా.. నాగశౌర్య మాట్లాడుతూ.. నిజానికి నేను అతన్ని కొట్టలేదు. ఎన్టీఆర్ వీరాభిమాని చనిపోయిన విషయం గురించి మాట్లాడుతూ.. జీవితంలో ఏం సాధించలేకపోతున్నానని అలా సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. అలాగే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పదలచుకున్నాను. నేను ఏదో పని మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కూకట్పల్లిలో రోడ్డు మీద కొడుతున్నాడు. అది చూసి ఆగి ఎందుకు కొడుతున్నావని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడితే కొడతాడు, చంపితే చంపుతాడు. మీకేంటి అని రివర్స్ అయ్యింది. అందుకే అమ్మాయిలకు చెప్తున్నా కొట్టే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దు. అది మీకు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. ప్రేమగా చూసుకునే వాళ్లతో తప్ప కొట్టినా, తిట్టినా భరిస్తామని పెళ్లి చేసుకోవద్దు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో ఖచ్చితంగా అమ్మాయిదే తప్పు అన్నారు. ఆ తర్వాత మీరు అమ్మాయికి ఏం చెప్పారు అని మళ్లీ ప్రశ్నించగా.. అలా అన్నాక ఇంకేం చెప్తాము. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను. కానీ నన్ను చంపేసినా, కొట్టినా పర్లేదంటే ఏం చేయగలను అని చెప్పుకొచ్చారు నాగశౌర్య. అలాగే చాలామంది ఆ గొడవని టిఆర్పి రేటింగ్ కోసమని అంటున్నారు అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు సడన్గా అనుకోకుండా అలా జరిగిపోయింది అని తెలిపారు నాగ శౌర్య.