తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.తాజాగా సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదట అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో హీరోగా మారిన శ్రీ విష్ణు ఆ తర్వాత సినిమా సినిమాకు తన టాలెంట్ తో తను ఏంటో నిరూపించుకుంటూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు.
అయితే, మెంటల్ మదిలో సినిమా శ్రీవిష్ణుకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరవాత బ్రోచేవారెవరురా సినిమా ఆడియన్స్ను విపరీతంగా మెప్పించింది. కాగా తాజాగా అనగానే గత నెల జూన్ 29న విడుదలైన సామజవరగమన సినిమా శ్రీవిష్ణుకి సాలిడ్ హిట్ ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు తన మాటలతో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. దర్శకుడు రామ్ అబ్బరాజు, కథా రచయిత భాను తనకు కథ చెప్పడానికి కరోనా టైమ్లో వచ్చారని శ్రీవిష్ణు చెప్పారు.
ఇద్దరు బడా బాయ్స్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడే దుబాయ్ నుంచి దిగినట్టు దిగారు. వాళ్లను చూసి ఇంతున్నారేంట్రా ఇద్దరూ అనుకున్నాను. మంచి సీరియస్ సినిమానో, యాక్షన్ మూవీ కథో చెప్తారేమో, ఎంజాయ్ చేసి పంపుదాం అనుకున్నాను. నాకు అటు ఇటు కూర్చున్నారు. కరోనా పీక్ టైమ్ అది. సెకండ్ వేవ్ అనుకుంటా రన్ అవుతుంది. మంచి వేవ్లో దూరారు ఇద్దరూ నా పక్కన. రామ్ స్టోరీ స్టార్ట్ చేశాడు. 10 నిమిషాల తరవాత దగ్గడం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్ సర్కిల్ అందరిలో కోవిడ్ సోకనిది నాకొక్కడికే. నేనొక్కడినే తప్పించుకున్నాను అనుకున్నాను. దొరికానురా ఇక ఆపడా అనుకుంటున్నాను. దగ్గుతూనే వాటర్ తాగి బయటికి ఊసేశాడు. బయపడి నేను పక్కకి వచ్చేశాను. మనం వారం తరవాత కూర్చుందాం అన్నాను. అప్పుడు ఇటువైపున్న భాను ఎత్తుకున్నాడు. కథ నాకు విపరీతంగా నచ్చేసింది అని శ్రీవిష్ణు సరదాగా చెప్పుకొచ్చారు. తరువాత హీరోయిన్ రెబా మోనికా జాన్ ( Reba Monica John )గురించి మాట్లాడుతూ.. సినిమా విడుదలైన తర్వాత వారం రోజులుగా మేం ఊళ్లు తిరుగుతున్నాము. , ఒంగోలు, గుంటూరు.. ఇలా చాలా ఊళ్లు వెళ్లాం. ఈవిడ కారెక్కడం, ట్విట్టర్లో చూడడం. మా ఊరిలో సబ్టైటిల్స్ వేయడం లేదు అని నాకు చెప్పడం. సబ్ టైటిల్స్ లేవని చెప్పి చెప్పి నా చెవులు నమిలేసింది. సినిమాకు ఎవరెళ్లారు అని అడిగితే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూశారంట, తెగ నవ్వేశారంట. సబ్ టైటిల్స్ లేకపోయినా నవ్వారు కదా, అర్థమైంది కదా, వదిలేయొచ్చు కదా అన్నాను. ఆహా లేదు. నిన్ను, నరేష్ గారిని చూస్తేనే వాళ్లు నవ్వేస్తున్నారు అంది. బాబూ ఆ సబ్టైటిల్స్ అంట వేసేయండి. ఒక్కసారి అంటే ఏమోనండి. కంటిన్యూగా సబ్టైటిల్స్ అని నా చెవులు నమిలేస్తే ఎలాగండి. ప్రశ్నలు అడగడం రెబా చాలా ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. తెలుగులో హీరోయిన్లకు ఒక్కోసారి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లు దొరకవు. ఒకరకంగా ఆవిడ మాకు దొరకడం అదృష్టం. ఈ సినిమాతో ఎంటర్ అవ్వడం ఆవిడకు అదృష్టం. చాలా మంచి సినిమాలు ముందు ముందు చేస్తుంది. చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు శ్రీ విష్ణు..