బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ రాజ్‌కుమార్ హిరానీతో 'డుంకి' అనే సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమా 150 కోట్లకు పైగా ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సరసన గ్లామర్ బ్యూటీ తాప్సీ కథానాయికగా నటిస్తుంది. రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు జియో స్టూడియోస్‌పై రాజ్‌కుమార్ హిరానీ మరియు గౌరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |