యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ (కల్కి 2898 AD) గ్లింప్స్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ‘కల్కి’పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతీ మూవీస్. భవిష్యత్ పై సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టమైన పని. కానీ మీరు ఆ సాహసం చేశారు. సాధ్యం చేసి చూపించారు. డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇంకా ఒక్క ప్రశ్నే మిగిలింది. అది రిలీజ్ డేట్’ అని ట్వీట్ చేశారు.
![]() |
![]() |