ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఏమంటావే ఈ మౌనం' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2023, 12:00 PM

పల్లవి:
ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే

నీ చూపే నవ్వింది
నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపు
కలిసే వేళ ఇదే

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే

చరణం 1:
సంతోషం ఉన్నా
సందేహంలోనా లోనా
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా
అంతా మాయేనా సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ
యవ్వనమా జమున వనమా
ఓ జాలే లేదా జంటై రావే ప్రేమా

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే

చరణం 2:
అందాలనుకున్నా… నీకే ప్రతిచోట చోట
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా… నీకే ప్రతిపూట పూట
వందేళ్ళు నాతో ఉంటే… వాడదు ఆశలకొమ్మ
అమృతమా అమిత హితమా
హో, అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే నాలానే నీకూ ఉంటే
తోడౌతావే నీలోనే నేనుంటే
నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది
ఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com