తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ స్థాపించిన స్వచ్ఛంద సేవా సంస్థ ‘రజనీకాంత్ ఫౌండేషన్’ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. వేలాది మందిని తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థ ట్రస్టీ శివరామకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 వేల మంది రిజిస్టర్ అయితే, 200 మందిని ఎంపిక చేసి వారికి బహుమతులు ఇస్తామని చెప్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారం నమ్మొద్దని సూచించారు.