ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హార్ట్ ఆఫ్ స్టోన్స్’ లో విలన్ గా అలియ

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 02:15 PM

బాలీవుడ్ న‌టి అలియా భట్ హాలీవుడ్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్స్’ లో విలన్ గా న‌టిస్తున్న‌ది. భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. దేశానికి ఎదురైన ఒక ప్రమాదాన్ని తప్పించడానికి గాల్ గ్యాడోట్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ టీమ్ ప్రయత్నాలకు అడ్డుపడుతూ అడుగడుగునా సవాళ్లు విసిరే విలన్ పాత్రలో అలియా కనిపించనుంది. యాక్షన్ సీన్స్ లోను ఆమె ప్రేక్షకులను అలరించనుంది.నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ఈ సినిమా, ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ నెల 11న రానుంది. ఇంగ్లిష్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలా తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి రానుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa