స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నలో హాస్య చతురత చాలా ఎక్కువ. ఈ అమ్మడు ఎవరితో సంభాషించినా చక్కటి ఛలోక్తులు విసురుతూ నవ్వించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులు తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానమిచ్చింది. తనకు నరుటో అనే వ్యక్తితో ఎప్పుడో పెళ్లయిపోయిందన్నారు. అతడినే జీవితకాలం ప్రేమిస్తుంటానని చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa