బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన "ఆదిపురుష్" సినిమా జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఎపిక్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 83.13 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయగా, సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ అతుల్ జంటగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
'ఆదిపురుష్' కలెక్షన్స్ రిపోర్ట్ :::::
నైజాం : 36.98 కోట్లు
సీడెడ్ : 10.23 కోట్లు
UA : 10.77 కోట్లు
ఈస్ట్ : 6.31 కోట్లు
వెస్ట్ : 4.54 కోట్లు
గుంటూరు : 6.96 కోట్లు
కృష్ణ : 4.72 కోట్లు
నెల్లూరు : 2.59 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 83.13 కోట్లు (133.57 కోట్ల గ్రాస్)