ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USAలో $1 మిలియన్ మైలురాయి దిశగా 'జైలర్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 08:53 PM

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం విడుదలకు ముందే USA బాక్సాఫీస్ వద్ద $800K వసూలు చేసిందని సమాచారం. ప్రీమియర్ల ద్వారానే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది USA బాక్సాఫీస్ వద్ద $1 మిలియన్ మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా జైలర్ నిలుస్తుంది.

ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జైలర్ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్‌ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com