టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి మూవీ మేకర్స్ 'ఖుషి' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ రొమాన్స్ మరియు ఎమోషనల్ మూమెంట్స్‌తో చక్కగా ప్యాక్ చేయబడింది. విజయ్ దేవరకొండ మరియు సమంతలు ఈ సినిమా ట్రైలర్ లో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. సెప్టెంబర్ 1, 2023న తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.