మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళాశంకర్' సినిమాకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 11న విడుదల కానున్న 'భోళా శంకర్' సినిమా టిక్కెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, అనేక పత్రాలు జతచేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చేసిందని చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.