'అఖండ' సినిమా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్కంద' అనే సినిమా చేస్తున్నాడు. బోయపాటి రామ్‌ని పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో చూపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 15న స్కంద విడుదల కానుంది.