ఈ నెల ఫిబ్రవరి 14 న తమిళ్ హీరో ఆర్య - సయేశా వారి బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు . అంతేకాకుండా , వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయాన్నీ కూడా తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఆర్య -సయేశా హైదరాబాద్ లో పెళ్లి చేసుకోబోతున్నారు అని తమిళ్ వర్గాలు చెబుతున్నాయి . ఈ పెళ్లి తేదీ ని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కానీ , ఈ పెళ్లి మార్చ్ లో ఉండబోతుంది అని చెప్పారు . ఈ పెళ్లి ని రెండు రోజులు వైభవంగా జరుపబోతున్నారు . సయేశా వాళ్ళ అమ్మ షాహీన్ మాట్లాడుతూ ఈ పెళ్లి మార్చ్ 9 ,10 న అట్టహాసంగా జరుగబోతోంది అని చెప్పారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa