ఆ ఆ ఆఆ ఆ ఆఆ
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కన్నా అమ్మే కదా ఆ ఆఆ
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా
కణకణలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్ళైనా తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు
ఆ అమ్మాలనే మించిన మా అమ్మకు
ఋణం తీర్చుకోలేను ఏ జన్మకూ
కంటేనే అమ్మ అని అంటే ఎలా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా
ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
మెడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
సిరుల జల్లులో నిత్యం పరవశించినా
మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
ప్రతి తల్లికి మమకారం పరమార్థం
ప్రతి తల్లికి మమకారం పరమార్థం
అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
రాతి బొమ్మే కదా
ఆ ఆ ఆఆ ఆ ఆ