ఈమధ్య ఈ టైమ్ ట్రావెల్ అదే కాలంలో వెనక్కి, ముందుకి వెళ్లడం నేపథ్యంలో సినిమాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు విశాల్, ఎస్ జె సూర్య నటించిన సినిమా 'మార్క్ ఆంటోనీ' కూడా ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమానే. దీనికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు కాగా, ఎస్ వినోద్ కుమార్ నిర్మాత. ఇందులో రీతూ వర్మ కథానాయకురాలు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం రండి.
ఆంటోనీ (విశాల్), జాకీ (ఎస్ జె సూర్య) ఇద్దరూ ప్రాణ స్నేహితులు, అలాగే గ్యాంగ్‌స్టర్స్ కూడా. ఏకాంబరం (సునీల్) తన తమ్ముడిని ఆంటోనీ చంపాడని, అతని మీద పగ తీర్చుకోవడానికి ఆంటోనీ ని ఒక క్లబ్ లో ప్లాన్ వేసి చంపేస్తాడు. జాకీ గాడ్ ఫాదర్ అయిపోతాడు, ఆంటోనీ కొడుకు మార్క్ (విశాల్) ని కూడా తన కొడుకుతో పాటు పెంచుకుంటాడు. ఒక శాస్త్రవేత్త (సెల్వ రాఘవన్) ఒక ఫోన్ ని కనిపెడతాడు, దాని ద్వారా కాలంలో వెనక్కి వెళ్లొచ్చు. ఈ ఫోన్ మార్క్ కి దొరుకుతుంది. మార్క్ ఎప్పుడూ తన తండ్రి ఒక పెద్ద రౌడీ అని, తన తల్లిని చంపిన నరరూప రాక్షసుడు అని నమ్ముతూ ఉంటాడు. అయితే ఈ ఫోన్ ద్వారా 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి తన తల్లితో (అభినయ) మాట్లాడుతాడు. అప్పుడు మార్క్ కి ఒక నిజం తెలుస్తుంది. ఏమాటా నిజం? ఇంతకీ 20 ఏళ్ల క్రితం చనిపోయిన మార్క్ ఎలా బతికాడు? అసలు ఆంటోనీని చంపింది ఏకాంబరమేనా లేదా వేరేవాడా? మరి బతికున్న జాకీ ఏమవుతాడు? ఇవన్నీ తెలియాలంటే 'మార్క్ ఆంటోనీ' సినిమా చూడాల్సిందే.