కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి బంపర్ ఆఫర్ కొట్తసింది. టాలీవుడ్ ఎంట్రీ కోసం సిద్ధమవుతోంది. కేజీఎఫ్ లో తన అందం, అభినయంతో ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అది కూడా నందమూరి నటసింహం బాలకృష్ణతో. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న బాలకృష్ణ.. ఈ సినిమా తరువాత డైరెక్టర్ బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఏ సినిమా. NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట మేకర్స్ కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ లో నటించిన ఈ బ్యూటీకి ఆ తరువాత సరైన హిట్ పడలేదు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం దక్కింది శ్రీనిధికి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోని శ్రీనిధి మల్లి ఫామ్ లోకి వస్తుందా అనేది చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa